
నగరంలో నకిలీ మద్యం
విశాఖ విద్య: నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారుల బృందం పట్టుకుంది. అతని వద్ద నుంచి 70 నకిలీ మద్యం సీసాలు, 1.5 లీటర్ల హోమియోపతిక్ స్పిరిట్, 225 వివిధ రకాల బ్రాండ్ల ఖాళీ మద్యం సీసాలు, ఏడు బ్రాండ్ల 76 లిక్కర్ ప్యాకేజ్ కవర్లు, 335 సీసా మూతలు, 99 లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు టెంపరేచర్ డ్యూయల్ గన్‌ను స్వాధీన పరచుకున్నారు. నగరంలోని సీతంపేటకు చెందిన కట్టమూరి రామకృష్ణ నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నాడనే సమాచారంతో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం నిఘా పెట్టి, పట్టుకున్నారు. రామకృష్ణ వద్ద నుంచి భారీగా నకిలీ మద్యంను స్వాధీనం చేసుకున్నారు. కేసు తదుపరి విచారణ కోసం మహారాణిపేట స్టేషన్‌కు అతన్ని అప్పగించినట్లు సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. ఈ దాడుల్లో ఈఎస్‌టీఎఫ్ సీఐ రవి కిరణ్, ఎస్‌ఐ ముసలి నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

నగరంలో నకిలీ మద్యం