
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు జాతీయ అవార్డులు
తాటిచెట్లపాలెం: ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్(ఏపీపీజేఏ), విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ–2025 పోటీల్లో ‘సాక్షి’ఫొటోగ్రాఫర్‌లు పలు విభాగాల్లో అవార్డులు సాధించారు. 186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు జరిగాయి. స్పాట్ న్యూస్ విభాగంలో పీఎల్ మోహన్‌రావు, జనరల్ న్యూస్ విభాగంలో ఎండీ నవాజ్‌లు ఏపీపీజేఏ అచీవ్‌మెంట్ అవార్డులను గెలుచుకున్నారు. వీరిని పలువురు అభినందించారు. కాగా.. ఈ పోటీలకు కోల్‌కతా, ముంబయి, న్యూఢిల్లీ, ఇండోర్, కేరళ, గోవా, కర్నాటక, చైన్నె, గుజరాత్, తెలంగాణ తదితర ప్రాంతాలకు చెందిన 135 మంది ఫొటోగ్రాఫర్లు రెండు విభాగాల్లో సుమారు 550 ఫొటోలను పంపించారు.

‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు జాతీయ అవార్డులు