
ఎస్సీ విభాగం సమావేశాన్ని విజయవంతం చేయండి
మహారాణిపేట : మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఈనెల 13వ తేదీన జరగనున్న వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు పిలుపునిచ్చారు. సోమవారం మద్దిలపాలెంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబురావుతో కలిసి ఎస్సీ సెల్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేబినెట్, నామినేట్ పదవుల్లో దళితులకు సముచిత స్థానం కల్పించారన్నారు. ఎస్సీ సెల్ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం నాయకులు పూర్ణచంద్రరావు, ఐడి బాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ రెయ్యి వెంకటరమణ, కార్పొరేటర్ శశికళ, ఎస్సీ సెల్ జోనల్ ఇన్‌చార్జి అల్లంపల్లి రాజబాబు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోని శివ రామకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరీ, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు బంగారు భవాని శంకర్, ఇతర నాయకులు లక్ష్మణ్ రావు, ఆకుల శ్యామ్, పూడి మల్లేశ్వరరావు, పరదేశి, జిల్లా ఎస్సీ విభాగం నాయకులు చలం, మురళి తదితరులు పాల్గొన్నారు.