
స్వాతంత్య్ర వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట : జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేలా వేడుకలు నిర్వహించాలని, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టాలని చెప్పారు. పోలీస్ మైదానంలో నిర్వహించే వేడుకలకు జిల్లా ప్రజలు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులు, ఇతర ప్రముఖులు ఆహ్వానితులేనని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శన నిర్వహించాలని, స్టాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ పథకాల కింద లబ్ధిపొందిన ప్రజలకు నగదు పంపిణీకి సంబంధించి చర్యలు తీసుకోవాలని, జాబితా రూపొందించాలని సూచించారు. సమావేశంలో జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్‌వో బీహెచ్ భవానీ శంకర్, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.