
త్వరలో కై లాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి
ఆరిలోవ: కై లాసగిరిపై నిర్మాణంలో ఉన్న గ్లాస్ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న ట్లు వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ తెలిపారు. సోమవారం వారు ఇక్కడ నిర్మాణంలో ఉన్న గ్లాస్ బ్రిడ్జిని పరిశీలించారు. పనులు ఎంతవరకు జరిగాయో ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసియాలోనే పొడవైన ఈ గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం కైలాసగిరిపై ఏర్పాటు చేయనున్న త్రిశూల్ ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ ప్రధాన ఇంజనీరు వినయ్‌కుమార్, పర్యవేక్షక ఇంజనీర్లు భవానీశంకర్, మధుసూదనరావు, కార్యనిర్వాహక ఇంజనీర్లు రామరాజు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.