
ఈట్ రైట్ క్యాంపస్ ప్రారంభం
డాబాగార్డెన్స్: నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు జీవీఎంసీ ఈట్‌రైట్ క్యాంపస్ ప్రారంభించి, వాటి అమలుకు 16 ప్రత్యేక ఎస్‌హెచ్‌ఈ టీమ్స్(శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్‌ఫోర్స్‌మెంట్) ఏర్పాటు చేయడం జరిగిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. నగరంలో హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు, వీధి ఆహార విక్రయ కేంద్రాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, పలు ఆహార పదార్థాల్లో హనికర రసాయనాలు వినియోగించడం వల్ల కేన్సర్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వాటిని పూర్తిగా అరికట్టేందుకు ప్రతి జోన్‌కు రెండు ‘క్షీ’ టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ టీమ్‌లో సహాయ వైద్యాధికారి, శానిటేషన్ సూపర్‌వైజర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, సచివాలయ శానిటరీ కార్యదర్శితో పాటు సచివాలయం మహిళా పోలీస్ ఒక బృందంగా ఉంటారని తెలిపారు. వీరు ప్రతిరోజూ కనీసం రెండు లేదా మూడు ఆహారం విక్రయించే కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తారన్నారు. ప్రస్తుతం జోన్‌కు 2 టీమ్‌లు ఉన్నాయని, అవసరమైతే 32 టీమ్‌లు ఏర్పాటు చేసి జోన్‌కు 4 చొప్పున కేటాయిస్తామన్నారు.