
పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 105 ఫిర్యాదులు
అల్లిపురం: పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు వచ్చాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. కార్యక్రమంలో సబ్–డివిజన్ ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులలో ఎక్కువగా కుటుంబ కలహాలు, భూ వివాదాలు, మోసాలు, సివిల్ కేసులకు సంబంధించినవి ఉన్నాయని పేర్కొన్నారు. కమిషనర్ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.