
స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి
ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్ స్టీల్ మెల్ట్ షాప్–1లో సోమవారం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికుడు దుర్మరణం చెందాడు. విభాగంలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్న కె.ఆర్.ఎల్ ఇంజనీరింగ్‌లో సురేష్ సింగ్ (26) అన్‌స్కిల్డ్ కార్మికునిగా విధులు నిర్వహిస్తున్నాడు. విభాగంలో ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా టిపి బేలో ఉన్న టండిష్‌లో స్లాగ్ మెటీరియల్ పోస్తారు. అక్కడ స్లాగ్ మెటీరియల్ స్లాబ్‌గా తయారవుతుంది. ఈ ప్రక్రియలో ఆ స్లాబ్‌కు ఇరువైపులా హుక్‌లు ఏర్పాటు చేస్తారు. అక్కడ తయారైన స్లాబ్‌ను డంపర్‌లో లోడు చేస్తుండగా హుక్ జారీ అక్కడ విధులు నిర్వహిస్తున్న సురేష్ సింగ్‌పై పడింది. తీవ్ర గాయాలతో సురేష్‌సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దీనిపై సీఐటీయూ నాయకులు కెఆర్‌ఎల్ యాజమాన్యంతో చర్చించగా నిబంధనల మేరకు వచ్చే వాటితో పాటు రెండు లక్షలు పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉపాధి, దహన ఖర్చులు చెల్లించడానికి అంగీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. స్టీల్‌ప్లాంట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.