
తొలగించిన విశాఖ డెయిరీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాల
బీచ్‌రోడ్డు: విశాఖ డెయిరీలో తొలగించిన 305 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడు తూ డైయిరీ కార్మికులు కొన్ని దశాబ్దాలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ, తమ విధి నిర్వహణలో ఎంతో అనుభవాన్ని సంపాదించారన్నారు. అటువంటి వారికి వేతనాలు పెంచడం, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సదుపాయాలను కల్పించాల్సిన యాజమాన్యం, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, వారిని తొలగించడం చట్ట విరుద్ధమన్నారు. అంతేకాకుండా అనుభవం ఉన్న కార్మికులను తొలగించి, కొత్తవారిని నియమించుకోవడం మరింత దుర్మార్గమన్నారు. అన్యాయంగా సస్పెండ్ చేసిన నలుగురు పర్మినెంట్ యూనియన్ నాయకులను కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, విశాఖ డెయిరీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం. రాంబాబు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ నాయకురాలు మణి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు, జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కే. సత్యనారాయణ పాల్గొన్నారు.