
వీఎంఆర్డీఏ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం
కొమ్మాది: జాతీయ రహదారి ఎండాడను ఆనుకుని రూ.9.50 కోట్ల వీఎంఆర్డీఏ నిధులతో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఆధునిక హంగులతో వెయ్యి సిట్టింగ్ సామర్థ్యంతో మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా కన్వెన్షన్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం భీమిలి నియోజకవర్గంలో సుమారు రూ.21 కోట్ల నిధులతో చేపట్టబోయే పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.