
సముద్రంలో మునిగి ఎలక్ట్రీషియన్ మృతి
భీమునిపట్నం: భీమిలి తీరంలో స్నానానికి దిగిన ఓ ఎలక్ట్రీషియన్ మరణించాడు. తీరానికి సమీపంలోని గొల్లలపాలేనికి చెందిన సరగడ అప్పలరెడ్డి(44) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు, ఇతనికి భార్య అరుణకుమారి, కూతురు హేమశ్రీ(16), కొడుకు మోజెస్(10) ఉన్నారు. ఆదివారం కుటుంబ సభ్యులు, స్నే హితులతో కలిసి లైట్‌హౌస్ సమీపంలో స్నానానికి దిగారు. పెద్ద కెరటం వచ్చి అప్పలరెడ్డిని లాక్కుపోయింది. గమనించిన తీరంలో ఉన్న ఫొటోగ్రాఫర్లు అతన్ని రక్షించి, కొన ఊపిరితో ఉన్న అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.