
2 వేల కిలోల వెండితో వినాయకుడు
చవితి ఉత్సవాలకు
యూత్ ఐకాన్ అసోసియేషన్ సన్నద్ధం
డాబాగార్డెన్స్: విశాఖ మహానగరంలో యూత్ ఐకాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 వేల కిలోల వెండితో వినాయకమూర్తిని ఏర్పాటు చేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధి శీరపు కనకరాజు తెలిపారు. ఈ మేరకు నగరంలోని వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వినాయక ఉత్సవాల వివరాలు వెల్లడించారు. ఏటా మాదిరే ఈ ఏడాది కూడా వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది బీచ్‌రోడ్డు విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వెనుకనున్న ఏపీఐఐసీ గ్రౌండ్‌లో ఈ నెల 27 నుంచి 21 రోజుల పాటు చవితి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. 14 ఎకరాల గ్రౌండ్‌లో 6 ఎకరాల్లో పార్కింగ్, 2 ఎకరాల్లో ఫ్లవర్ షోతో, దేశంలోనే తొలిసారిగా 2 వేల కిలోల వెండి విగ్రహాన్ని వినూత్న రీతిన విశాఖలో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. గర్భిణులు, వికలాంగులు, వృద్ధులకు ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయ నమూనా సెట్ వేయనున్నామన్నారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులు పొందినట్లు పేర్కొన్నారు. స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఠీఠీఠీ. డౌఠ్టజిజీఛిౌుఽ. జ్చుఽ్ఛట. ఛిౌఝల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు ఎస్.లక్ష్మణ్, ఎస్.లీలాధర్, బేరి మన్మధరావు, కె.భరత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.