
సకల సౌభాగ్యదాయినీ నమోస్తుతే
● వాడవాడలా వరలక్ష్మీ వ్రతాలు ● సామూహిక వ్రతాలతో కిక్కిరిసిన ఆలయాలు
డాబాగార్డెన్స్: సకల సౌభాగ్యాలు ప్రసాదించే శ్రావణలక్ష్మి నామస్మరణతో నగరం మార్మోగింది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే పవిత్ర శుక్రవారం కావడంతో వరలక్ష్మి వ్రతాన్ని ప్రజలు తమ ఇంట భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ప్రతి ఇల్లూ ఓ దేవాలయంగా మారింది. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
స్వర్ణాలంకరణలో కనకమహాలక్ష్మి
నగరంలోని బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారు స్వర్ణాభరణాలంకరణలో ధగధగ మెరిసిపోతూ భక్తులకు దర్శనమిచ్చింది. దేవస్థానంలో వరలక్ష్మీ వ్రత పూజలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి, వేద మంత్రాలు, నాదస్వర వాయిద్యాల మధ్య ఉదయం 8.10 గంటలకు శ్రావణలక్ష్మి పూజలు ప్రారంభించారు. విశిష్ట శ్రావణలక్ష్మీ పూజలో 85 మంది ఉభయదాతలు నేరుగా పాల్గొన్నారు. పోస్టు ద్వారా వివరాలు పంపి డబ్బు చెల్లించిన 225 కుటుంబాల పేరిట అర్చన చేసి, వారికి కుంకుమ, ప్రసాదం పంపారు. అమ్మవారిని పలువురు ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రావణ మాసంలో జరిగే పూజలో పాల్గొనదలచే భక్తులు 0891–2711725, 2568645 నంబర్లలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు.
లక్ష్మీదేవి వెండి ప్రతిమలు బహూకరణ: ఉదయం 8 గంటలకు మొదటి బ్యాచ్, 9.30కు రెండవ బ్యాచ్ పూజలో పాల్గొన్న మహిళల్లో డ్రా తీసి ఆలయ మాజీ చైర్మన్ వంకాయల సన్యాసిరాజు(తాతాజీ) ఆలయ ఈవో, ఏఈవో చేతుల మీదుగా లక్ష్మీదేవి వెండి ప్రతిమలు బహూకరించారు. ఆలయ పర్యవేక్షకుడు టి.తిరుపతిరావు, వేదపండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సకల సౌభాగ్యదాయినీ నమోస్తుతే

సకల సౌభాగ్యదాయినీ నమోస్తుతే

సకల సౌభాగ్యదాయినీ నమోస్తుతే