
మరణించి మరో ఇద్దరికి వెలుగునిచ్చి..
పెందుర్తి: అనారోగ్యంతో మరణించిన ఇంటి పెద్ద నేత్రాలు దానం చేసి మానవత్వం చాటుకుంది ఓ కుటుంబం. చింతలగ్రహారం గవరపాలేనికి చెందిన కాళ్ల కన్నారావు(65) ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఈ నేపథ్యంలో స్థానిక సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి దాడి శ్రీనివాస్ మృతుని కుటుంబ సభ్యులను సంప్రదించి, నేత్రదానంపై అవగాహన కలిగించారు. దీంతో కన్నారావు భార్య లక్ష్మి, కుమారుడు ముత్యాలనాయుడు, కుమార్తె లక్ష్మి అంగీకారం తెలిపారు. దీంతో ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రి సారథ్యంలోని మొహిసిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు కన్నారావు నేత్రాలను సేకరించి ఆస్పత్రికి తరలించారు. పుట్టెడు దుఃఖంలోనూ కన్నారావు కుటుంబ సభ్యుల మానవత్వాన్ని స్థానికులు ప్రశంసించారు.

మరణించి మరో ఇద్దరికి వెలుగునిచ్చి..