
19న ఫొటో జర్నలిస్టుల ఎగ్జిబిషన్
మహారాణిపేట: వైజాగ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహించే ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం వైజాగ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు వై. రామకృష్ణ, కార్యదర్శి ఎం.డి. నవాజ్, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబుతో కలిసి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆవిష్కరించారు. 186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వైజాగ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ మ్యూజియంలో 19, 20 తేదీల్లో ఎగ్జిబిషన్ జరుగుతుందని అసోసియేషన్ సభ్యులు కమిషనర్‌కు తెలిపి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఫొటో ఎగ్జిబిషన్‌కు సందర్శకులు, విద్యార్థులు హాజరవుతారు కనుక సందేశాత్మకంగా, ఆకర్షణీయంగా ఉండే ఫొటోలు ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫొటో జర్నలిస్టులు పి.ఎల్.మోహన్‌రావు, పెద్దిరాజు, శరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.