
12 గంటల్లో 10 రోబోటిక్ శస్త్ర చికిత్సలు
ఆరిలోవ: హెల్త్‌సిటీ కేర్ ఆస్పత్రిలో 12 గంటల్లో 10 రోబోటిక్ టోటల్ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరిపినట్లు మోకాలి మార్పిడి సర్జన్ డాక్టర్ రవిచంద్ర తెలిపారు. ఇది ఒక కీలక ఘట్టమన్నారు. అత్యాధునిక వెలిస్ రోబోటిక్ సిస్టమ్ సహాయంతో ఆర్థోపెడిక్ వైద్య బృందం తన ఆధ్వర్యంలో ఈ శస్త్ర చికిత్సలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఒకే రోజు, ఒకే సర్జన్ ద్వారా ఇన్ని శస్త్ర చికిత్సలు జరపడం రాష్ట్రంలోనే ఇది తొలిసారిని తెలిపారు. డాక్టర్ రఘు యలపర్తి, డాక్టర్ రాజనాయుడు, డాక్టర్ అజయ్ శస్త్ర చికిత్స ప్రక్రియకు దోహదపడ్డారన్నారు. కేర్‌లో వైద్య బృందం నైపుణ్యం వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ వైద్య బృందాన్ని కేర్ సీవోవో మయూఖ్ చౌదరి అభినందించారు.