
13న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు
మద్దిలపాలెం : ఏయూలో ఎంబీఏ, ఎంసీఏ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య డి.ఎ.నాయుడు పేర్కొన్నారు. ఎంబీఏ పుల్ టైమ్ కోర్సులకు ఏడాదికి రూ.1.5 లక్షలు, ఎంసీఏ కోర్సుకు రూ.1.25 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఐసెట్–2025లో ర్యాంకులకు అనుగుణంగా ప్రవేశాలను కల్పించనున్నామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 11వ తేదీలోగా దరఖాస్తులను అందజేయాలని సూచించారు. కౌన్సెలింగ్ ఈనెల 13వ తేదీన జరుగుతుందని ప్రకటించారు.