
పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి
బీచ్‌రోడ్డు: పెట్టుబడిదారులు వ్యక్తిగత శ్రద్ధతోపాటు, సెబీలో నమోదైన మధ్యవర్తుల ద్వారా మాత్రమే వ్యాపారం చేయాలని సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.రామ్‌మోహన్‌రావు సూచించారు. సిరిపురంలోని చిల్డ్రన్స్ ఎరీనాలో మెగా రిసా పేరిట పెట్టుబడిదారుల అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. స్మార్ట్ పెట్టుబడి–సురక్షితమైన భవిష్యత్తు వైపు అనే అంశంతో సాగిన సదస్సును కలెక్టర్ హరేందిరప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడిదారుల రక్షణ పట్ల సెబీ నిబద్ధతను వివరించారు. స్కామర్లు, మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సెబీ చీఫ్ జనరల్ మేనేజర్ దీప్తి అగర్వాల్, డీసీపీ కృష్ణకాంత్ పటేల్ పాల్గొన్నారు.
డ్వాక్రా ఆర్పీలే పెట్టుబడిదారులు!
సదస్సులో 800 మందికి పైగా పెట్టుబడిదారులు పాల్గొన్నారని, అందులో 70 శాతం మహిళలే అని గొప్పలు చెప్పారు. నిజానికి వారిలో అత్యధికులు పెట్టుబడిదారులు కాదు. డ్వాక్రా ఆర్పీలను మహిళా పెట్టుబడిదారులుగ సదస్సులో కూర్చొబెట్టారు. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు లేకపోవటంతో జీవీఎంసీ అధికారులు ఆర్పీలను సదస్సుకు తరలించారు. విషయం బయటకు తెలియటంతో సదస్సులోని ఆర్పీలు చాలా మంది బయటకు పరుగులు తీశారు.
సెబీ ఈడీ రామ్‌మోహన్‌రావు