
పారా అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటాలి
మహారాణిపేట : పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్‌లో ఈనెల 9న ప్రారంభం కానున్న రాష్ట్ర స్థాయి 6వ జూనియర్, సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి జూనియర్, సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి వి.రామస్వామి, విశాఖపట్నం జిల్లా గౌరవ అధ్యక్షురాలు శీతల్ మదన్, గుంటూరు జిల్లా సెక్రటరీ వై.శ్రీనివాస్ గౌడ్, పారా స్పోర్ట్స్ సభ్యులు పాల్గొన్నారు.