
సుజికీ ఎరీనా షోరూం ప్రారంభం
మురళీనగర్: దేశంలోనే నంబర్ వన్‌గా వెలుగొందుతున్న మారుతీ డీలర్ వరుణ్ మోటార్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన నూతన మారుతీ సుజుకీ ఎరీనా షోరూమ్‌ను మురళీనగర్‌లో సోమవారం ప్రారంభించారు. వరుణ్ గ్రూపు చైర్మన్ ప్రభుకిషోర్ ఈ కార్ల షోరూమ్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ విశాలమైన ప్రాంగణం, అధునాతన సౌకర్యాలు, అనుభవజ్ఞులైన సిబ్బందితో అత్యత్తమమైన సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో వరుణ్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ దేవ్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష హనుమార, మారుతి సుజికి ఏరియా మేనేజర్ నరైన్ సింగ్ విర్క్, టెరిటరీ సేల్స్ మేనేజర్ కపిల్ గుప్తా, వరుణ్ మారుతి జీవీఎస్‌ఎన్ నవీన్ రాజు, ప్రసాదరాజు, నవీన్, మారుతి సిబ్బంది పాల్గొన్నారు.