
అక్రమ మైనింగ్‌పై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు
పద్మనాభం: కృష్ణాపురం గ్రామంలోని సర్వే నంబర్ 74/1లో అక్రమంగా మైనింగ్ చేస్తున్న మొకర నాగరాజు, మొకర గౌరినాయుడులపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన టి. రమేష్, బి. అప్పలనాయుడు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ లక్ష్మీ భవాని అండదండలతో వీరు అక్రమంగా బ్లాస్టింగ్ చేసి నల్లరాయిని తరలిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రోజుకు ఐదు నుంచి ఎనిమిది లారీల నల్లరాయిని అక్రమంగా తరలిస్తున్నారని, 20 నుంచి 30 అడుగుల లోతు వరకు తవ్వడం వల్ల జంతువులకు, వాటిని మేపే వారికి ప్రాణాలకు ప్రమాదం ఉందని ఫిర్యాదుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.