
జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌లో ‘టౌన్‌ప్లానింగ్’పై ఫిర్యాదులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 99 ఫిర్యాదులు అందాయి. ఇందులో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన ఫిర్యాదులే అత్యధికంగా 54 ఉన్నాయి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ఇతర ఫిర్యాదుల్లో రెవెన్యూకు 10, ఇంజినీరింగ్‌కు 18, ప్రజారోగ్య విభాగానికి 5, యూసీడీ విభాగానికి 6 ఫిర్యాదులు ఉన్నాయి. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను వివరించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు వేసిన చోట వీధి లైట్లు ఏర్పాటు చేయాలని జోన్–2 పరిధిలోని ప్రజలు కోరారు. అలాగే మధురవాడలో బరియల్ గ్రౌండ్ పనులను రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయాయని ఆ ప్రాంతవాసులు మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించి పనులు ప్రారంభించాలని వారు కోరారు.