
లయన్స్ క్లబ్ 316ఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
బీచ్‌రోడ్డు: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 316ఎ నూతన కార్యవర్గం ఆదివారం సిరిపురం బాలల ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేసింది. జిల్లా గవర్నర్ డి. సూర్యప్రకాష్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో, లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్ బాబు, పూర్వ డైరెక్టర్ విజయ్ కుమార్ నూతన సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గాట్ ఏరియా లీడర్లు, ఆర్.సి., జెడ్.సి., టీమ్ లీడర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. కార్యక్రమానికి పాస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు సుబ్బరాజు, బి. తిరుపతిరాజు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ పి. చంద్రశేఖర్, కో–కన్వీనర్లు వి. కోటేశ్వరరావు, ఎన్.వి.ఎస్.ఎస్. ప్రసాదనాయుడు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ ట్రస్టీ ఎస్. ఉదయశంకర్ మరియు ఇతర లయన్స్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.