
ముగ్గురు పర్యాటకులనుకాపాడిన లైఫ్‌గార్డ్స్
కొమ్మాది: రుషికొండ బీచ్‌లో ఇద్దరు పర్యాటకులు సముద్రంలో కొట్టుకుపోతుండగా, అప్రమత్తమైన లైఫ్‌గార్డ్స్ వారి ప్రాణాలను కాపాడారు. జార్ఖండ్‌కు చెందిన 14 మంది పర్యాటకులు ఆదివారం సాయంత్రం రుషికొండ బీచ్‌కు చేరుకున్నారు. సరదాగా గడిపి స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగగా, అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో వారిలో అంకుర్ కుమార్, గౌతమ్ సాహు కొట్టుకుపోయారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న లైఫ్‌గార్డ్స్ ఎస్. నూకరాజు, ఎం. అమ్మోరు, చందు, సతీష్, గురుమూర్తి, రాజ్‌కుమార్ వీరిని గమనించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మైరెన్ పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. పర్యాటకుల ప్రాణాలను కాపాడిన లైఫ్‌గార్డ్స్‌ను మైరెన్ సీఐ శ్రీనివాసరావు అభినందించారు. అదేవిధంగా రుషికొండ బీచ్‌లో స్నానం చేస్తుండగా విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన కోరాడ నిఖిల్ కుమార్ కూడా కెరటాల ఉధృతికి కొట్టుకుపోతుండగా, అక్కడే ఉన్న లైఫ్‌గార్డ్స్ అతన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.