
విశాఖ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటాలి
మురళీనగర్: విశాఖ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. మురళీనగర్‌లోని వనితా వాకర్స్ భవనంలో ‘వావ్’సంస్థ ఆదివారం ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2025లో పతక విజేతల అభినందన సభ ఏర్పాటు చేసింది. మలేసియా, శ్రీలంకలో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్–2025లో ‘వావ్’ అథ్లెట్లు ఎం.రామారావు, కె.బి.వి.ఎం.కృష్ణ ప్రసాద్, కె.పూర్ణిమ, కె.మత్స్యకొండ స్వర్ణ, కాంస్య, రజత పతకాలను సాధించారు. వీరికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను సీపీ అందజేసి అభినందించారు. గౌరవ డాక్టరేట్ పొందిన ’వావ్’ చీఫ్ ప్యాట్రన్, సామాజిక కార్యకర్త డాక్టర్ కమల్ బైద్‌ను పోలీస్ కమిషనర్ సత్కరించారు. కొత్త ట్రస్టీలు సుబోధ్ కుమార్, కపిల్ అగర్వాల్, వావ్ అధ్యక్షుడు డా.మంగ వరప్రసాద్, కార్యదర్శి సుధాకర్, కోశాధికారి ఎం.రామారావు, కోఆర్డినేటర్ సి.హెచ్. శ్రీనివాసరాజు, పీఆర్వో వంశీ చింతలపాటి, వాకర్స్ డిస్ట్రిక్ట్–101 గవర్నర్ కె. ద్వారకానాథ్, వైశాఖీ స్పోర్ట్స్ పార్క్ కార్యదర్శి పి.ఎస్.ఎన్. రాజు, వనితా వాకర్స్ అధ్యక్షురాలు పి. ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
సీపీ శంఖబ్రత బాగ్చి