
వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీల చించివేత
మల్కాపురం: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కూటమి సర్కార్ తీరును ఎండగడుతూ బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ పేరిట 45వ వార్డు ఏకేసీ కాలనీకి వెళ్లే మార్గంలో అన్ని అనుమతులతో వార్డు కార్పొరేటర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి చింపివేశారు. ఆదివారం ఉదయం చూసేసరికి ఫ్లెక్సీ చిరిగి ఉండటంతో కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదేమాదిరిగా రెండు సార్లు ఫ్లెక్సీలను చింపేశారని గుర్తు చేశారు. దీనిపై గతంలో సీఐకు ఫిర్యాదు చేశానని, ఆయన స్పందించి ఫ్లెక్సీ చింపిన వారిని గుర్తించి, హెచ్చరించారని పేర్కొన్నారు. మళ్లీ ఇపుడు అదే జరిగిందన్నారు. కారకులైన వారిని గుర్తించి, చర్యలు తీసుకోవాలని కోరారు.
చిరిగిన ఫ్లెక్సీలు