విశాఖ సిటీ: నగరంలో సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు కంప్యూటర్ నైపుణ్యం ఉన్న 12 మందిని బీ కేటగిరీ హోంగార్డులుగా నియమించారు. వీరికి శుక్రవారం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి నియామక పత్రాలు అందజేశారు.
మరో ఇద్దరిపై పీడీ యాక్ట్
అల్లిపురం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధి అంబేడ్కర్ కాలనీకి చెందిన రావాడ ఉదయ్ భాస్కర్, ఈతలపాక రాజ్‌కుమార్‌లపై పీడీ యాక్ట్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వీరిద్దరూ పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఏడాది కాలం పాటు వీరికి నగర బహిష్కరణ విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


