సాక్షి టీవీ రిపోర్టర్‌పై టీడీపీ కార్యకర్తల దాడి | - | Sakshi
Sakshi News home page

పిడిగుద్దులు గుద్దారు.. సెల్‌ఫోన్‌ లాక్కొన్నారు..

Aug 16 2023 1:06 AM | Updated on Aug 16 2023 12:15 PM

సీఐ కోరాడ రామారావుకు ఫిర్యాదు చేస్తున్నబాధితుడు సురేష్‌, జర్నలిస్టులు - Sakshi

సీఐ కోరాడ రామారావుకు ఫిర్యాదు చేస్తున్నబాధితుడు సురేష్‌, జర్నలిస్టులు

విశాఖపట్నం: ఆర్‌.కె.బీచ్‌లో మంగళవారం రాత్రి జరిగిన చంద్రబాబునాయుడు సభ కవరేజీకి వెళ్లిన ఆరిలోవ జోన్‌ ‘సాక్షి’ టీవీ రిపోర్టర్‌ సురేష్‌పై టీడీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారు. సుమారు 30 మంది వరకు దుర్భాషలాడుతూ సురేష్‌ సెల్‌ఫోన్‌ లాక్కొని.. పిడిగుద్దులు గుద్దుతూ బయటకు నెట్టేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారించినా వినకుండా పెట్రేగిపోయారు.

ఈ దాడిపై మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ సీఐ కోరాడ రామారావుకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. టీడీపీ గుండాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement