తాటిచెట్లపాలె: దొండపర్తిలోని డీఆర్‌ఎం కార్యాలయంలో శుక్రవారం ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ 117వ డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ(డీఆర్‌యూసీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఆర్‌ఎం అనూప్‌కుమార్ సత్పతి వాల్తేర్ డివిజన్‌లో డీఆర్‌యూసీసీ సభ్యుల పాత్రను అభినందించారు. పలువురు సభ్యులు ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను డీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు. పరిశుభ్రత, ఎస్కలేటర్లు, లిఫ్ట్, రిటైరింగ్ రూం, రైళ్ల పెంపుదల, పాదచారుల వంతెన, తదితర అంశాలపై చర్చించారు. సభ్యులు తెలిపిన సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని డీఆర్‌ఎం హామీ ఇచ్చారు. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ 2 ప్రీతిరాణా, డీఆర్‌యూసీసీ సభ్యులు యర్రం వెంకటరెడ్డి, నెక్కంటి భాస్కరరావు, తాడేల ఉమా వెంకట మహేశ్వరరావు, మనోజ్‌కుమార్ ఆచార్య, కొప్పిశెట్టి శంకరరావు పాల్గొన్నారు.


