● ఎస్పీ స్నేహ మెహ్ర
● ట్రాఫిక్ నిర్వహణ, ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కొడంగల్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. బుధవారం కొడంగల్‌లోని కడా కార్యాలయంలో ట్రాఫిక్ నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్‌లో రాష్ట్రస్థాయి రైతు మేళా నిర్వహించనున్నారు. సీఎం వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన రూట్‌మ్యాప్, బందోబస్తు, విధుల కేటాయింపుపై జిల్లా పోలీసు అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. అనంతరం సభాస్థలిని, రైతుమేళా నిర్వహించే ప్రాంతాన్ని, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని విభాగల అధికారులు సమన్వయం చేసుకుంటూ సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీసీఆర్బీ డీఎస్పీ జనయ్య, డీసీటీ డీఎస్పీ శ్రీనివాస్, పరిగి డీఎస్పీ ఎన్ శ్రీనివాస్, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, ఏఆర్ డీఎస్పీ వీరేష్, జిల్లాలోని సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


