కుల్కచర్ల: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. విధులకు హాజరుకాకుండానే ఫేస్ రికగ్నైస్ యాప్‌తో అటెండెన్స్ వేయడంపై ‘సాక్షి’ దినపత్రికలో రాకున్నా వచ్చినట్లే అనే శీర్షిక ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. విచారణ జరపాలని చౌడాపూర్ ఎంపీఓ శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. బుధవారం ఆయన బొర్రహెమ్యతండా, భజ్యనాయక్ తండా, గోగ్యనాయక్ తండా, కొత్తపల్లి తండా కార్యదర్శులకు మెమోలు జారీ చేశారు. 48 గంటల్లో విచారణకు హాజరుకావాలని లేకుంటూ శాఖా పరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.


