కొడంగల్: పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు పాఠశాల భవనం పైనుంచి పడిన ఇంటర్ విద్యార్థి గాయత్రి నిమ్స్‌లో చికిత్స పొందుతోంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఎవరికీ తెలియకుండా కొడంగల్ ఆస్పత్రికి తరలించారని, విషయం బయటకు రాకుండా గోప్యత పాటించారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపల్ స్రవంతి తీరును తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి, వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం
కందుకూరు: రక్తదానం చేయడం ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేయడంతో సమానమని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం మహేశ్వరం మండల కేంద్రంలోని సుమంగళి కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాల్లో రక్తదానం గొప్పదన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇచ్చిన యువకులు, కార్మికులు, ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులను అభినందించారు. రక్తదాన శిబిరంలో సుమారు 2వేల మంది పాల్గొనగా 680 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, మహేశ్వరం, కందుకూరు సీఐలు రాఘవేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు మారయ్య, ప్రసాద్, ధనుంజయ్, ట్రాఫిక్ పోలీసులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
పక్కాగా ఆధారాలు సేకరించి.. మరణ శిక్ష పడేలా చేసి..
● డీఎస్పీ సాయిని శ్రీనివాసరావుకు అవార్డు తెచ్చిన కేసు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో డీఎస్పీగా పని చేస్తున్న సాయిని శ్రీనివాసరావుకు యూనియన్ హోం మినిస్టర్స్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ దక్కింది. కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు కేంద్ర దీన్ని అందిస్తుంది. రాష్ట్రీయ ఏక్తా దివాస్‌గా పరిగణించే సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి నేపథ్యంలో శనివారం దీన్ని ప్రకటించింది. శ్రీనివాసరావు గతంలో సనత్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో (2011 జూలై 18న) జరిగిన ఓ మహిళ హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం మరణశిక్ష విధించేలా పక్కాగా దర్యాప్తు చేశారు. ఆరు నెలల తొమ్మిది రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ సమర్పించారు. ఈ కేసు ఛేదించినందుకు ఆయనకు ఈ గుర్తింపు దక్కింది.
విద్యుత్‌షాక్‌తో చిన్నారి మృతి


