నాణ్యమైన వైద్యసేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

Nov 1 2026 8:19 AM | Updated on Nov 1 2026 8:19 AM

షాద్‌నగర్‌: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి అన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలం చించోడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. కాంట్రాక్టు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ విధులకు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో సీసీ సురేష్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం

కొత్తూరు: ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని జిల్లా వైద్యాధికారి కళ్యాణ్‌ చక్రవర్తి సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన టీబీ ముక్త్‌భారత్‌ శిబిరాన్ని సందర్శించారు. ఇందులో భాగంగా టీబీ నిర్ధారణ పరీక్షలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టీబీని ప్రాథమిక దశలో గుర్తించి పూర్తిస్థాయి చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి దీప్తి, సిబ్బంది నగేష్‌, జ్యోతి, రవి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement