క్రీడా ప్రాంగణం | - | Sakshi
Sakshi News home page

క్రీడా ప్రాంగణం

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

సోమవారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 అలంకారప్రాయం.. క్రీడా ప్రాంగణం 8లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
అలంకారప్రాయం..

వికారాబాద్‌: జిల్లాలోని తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా మారాయి. ఐదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి పంచాయతీలో మైదానాలు ఏర్పాటు చేసింది. భూమి కేటాయించి బోర్డులు పాతింది. క్రీడా పరికరాలు పంపిణీ మరిచింది. ఎంపిక చేసిన స్థలాలను అభివృద్ధి చేయకపోవడం, నిర్వహణను గాలికి వదిలేయడంతో అవి నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. అప్పట్లో పలువురు తహసీల్దార్లు ఎంతో శ్రమించి క్రీడా ప్రాంగణాలకు స్థలాలు కేటాయించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఆట వస్తువులు పంపిణీ చేయకపోవడంతో యువకులు క్రీడలకు దూరమవుతున్నారు.

మూడెకరాలు అవసరం

గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలకు భూములు కేటాయించి సదుపాయాలు కల్పించడం మరిచిపోయింది. ప్రతి జీపీలో అర ఎకరం మాత్రమే భూమి కేటాయించింది. ఈ స్థలం కొన్ని క్రీడలకు మాత్రమే సరిపోతుంది. క్రికెట్‌కు కనీసం మూడెకరాల స్థలం ఉండాలి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది యువకులు క్రికెట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం కేటాయించిన భూమి ఏ మాత్రం సరి పోదని రెండు మూడు గ్రామాలకు కలిపి ఒకే చోట క్రికెట్‌ గ్రౌండ్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. క్రీడాప్రాంగణాల నిర్వహణకు ఏడాదికి ఒక్కసారైనా నిధులు కేటా యించాలని కోరుతున్నారు. నిర్వహణ బాధ్యతలు గ్రామ పంచాయతీలకు అప్పగించి ఉన్నతాధికారు లు పర్యవేక్షించాలని కోరుతున్నారు. వికారాబాద్‌, పరిగి, తాండూరు మున్సిపాలిటీల్లో ఇటీవల ప్రైవేటు క్రికెట్‌ మైదానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ రోజుకు వేలకు వేలు చెల్లించి ఆటలు ఆడాల్సి వస్తోంది. పేద విద్యార్థులు, చిన్నారులు ఈ స్థాయిలో డబ్బు చెల్లించే స్థోమత లేక గల్లీల్లో క్రికెట్‌ ఆడుకోవాల్సి వస్తోంది.

జిల్లాలో ఏర్పాటు చేసిన మైదానాలు 585

బోర్డులతో సరి.. నిర్వహణ గాలికి

పిచ్చి మొక్కలతో నిండిన ఆట స్థలాలు

క్రీడా పరికరాలుపంపిణీ చేయని వైనం

ఆటలకు దూరమవుతున్న గ్రామీణ యువకులు

585 గ్రామ పంచాయతీల్లో..

జిల్లాలో 585 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతిచోట క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దశగా చర్యలు తీసుకుంది. ప్రతి ప్రాంగణానికి 2వేల చదరపు గజాలు లేదా 20 గుంటలకు తగ్గకుండా భూమిని కేటాయించింది. ఇందుకోసం గ్రామ సమీపంలో గల ప్రభుత్వ భూమి లేదా అటవీ భూములను సేకరించారు. ప్రభుత్వ స్థలం లేని చోట జీపీల్లో లేఅవుట్లు చేస్తే వాటి ద్వారా సామాజిక అవసరాల కింద ఇచ్చే 10శాతం భూమిని క్రీడా ప్రాంగణాల కోసం కేటాయించేలా నిర్ణయించారు. ఇలా అన్ని జీపీల్లో స్థలాలు కేటాయించారు. కొన్ని చోట్ల చిన్న చిన్న ఆట, వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయగా మెజార్టీ గ్రామాల్లో ప్రాంగణాలు బోర్డులకే పరిమితమయ్యాయి. ఎంతో ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నేడు అలంకారప్రాయంగా మారాయి. ఇప్పటికై నా అధికారులు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని యువకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement