జిల్లాకు 6,669 ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు 6,669 ఇందిరమ్మ ఇళ్లు

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

బషీరాబాద్‌: సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా జిల్లాకు కొత్తగా 6,669 ఇళ్లను కేటాయించింది. ఎల్‌–1 జాబితాలోని అర్హుల నుంచే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గతంలో మంజూరై నిర్మాణాలు ప్రారంభం కాని సుమారు 3వేల ఇళ్లను కొత్త లబ్ధిదారులకు కేటాయించనున్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్ల మరమ్మతులు చేపట్టి కొత్తగా స్లాబ్‌ వేసుకోవాలనుకునే అర్హులకు ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఇంటికి నాలుగు గోడలు ఉండటంతోపాటు ప్లింత్‌ ఏరియా 600 చదరపు అడుగులు ఉండాలనే నిబంధన వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. స్లాబ్‌ వేసి నిర్మాణం పూర్తి చేసిన తర్వాత నిబంధనల ప్రకారం సాయం అందించనున్నారు. రూఫ్‌ రీప్లేస్‌మెంట్‌ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున కేటాయించనున్నారు. జిల్లాకు ఈ విభాగంలో కొత్తగా 2 వేల ఇళ్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

కమిటీల ద్వారా ఎంపిక

గ్రామాల్లోని ఇందిరమ్మ కమిటీలు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాలను ఎమ్మెల్యేల ద్వారా జిల్లా కలెక్టర్‌కు అందజేస్తాయి. తర్వాత అర్హులకు మంజూరు పత్రాలు జారీ చేసి, నిర్మాణాలకు మార్కింగ్‌ ఇస్తారు.

కొత్తవారికి అవకాశం

జిల్లాలో కొత్తగా వచ్చిన 6,669 ఇళ్లలో ఒక్కో నియోజవర్గానికి 2 వేలు కేటాయించారు. వీటితో పాటు మొదటి విడతలో మంజూరై ఇప్పటికీ ఇంటి నిర్మాణాలు ప్రారంబించని మరో 3వేల ఇళ్లు కూడా ఎల్‌–1 జాబితాలోని అర్హులైన కొత్తవారికి కేటాయించనున్నారు. ఈ నిర్ణయంతో మరిన్ని పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరే అవకాశం ఉంది.

ఎల్‌ –1 జాబితా నుంచే లబ్ధిదారుల ఎంపిక

రూఫ్‌ రీప్లేస్‌మెంట్‌కూ రూ.2 లక్షల సాయం

ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల కేటాయింపు

ప్లింత్‌ ఏరియా 600 చదరపు అడుగులు తప్పనిసరి

ప్రారంభం కాని 3వేల ఇళ్లు కొత్తవారికి

నియోజకవర్గాల వారీగా..

నియోజకవర్గాల వారీగా ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేశాం. గ్రామాల్లోని కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబి తాను ఎమ్మెల్యేల ద్వా రా అందజేయాలి. వాటి ఆధారంగా అర్హులకు మంజూరు పత్రాలు జారీ చేస్తాం. ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్‌ ఇస్తాం. వీటిలోనే రూఫ్‌ రీప్లేస్‌మెంట్‌ కింద కొత్తగా 2 వేల ఇళ్లు కూడా కేటాయించాం. అర్హులు స్లాబ్‌ వేసి నిర్మాణం పూర్తి చేస్తే రూ.2 లక్షల సాయం అందుతుంది. – మత్రునాయక్‌, పీడీ హౌసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement