దౌల్తాబాద్: వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ పాలన సాగుతోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం మండలంలోని గోకఫసల్‌వాద్ గ్రామంలో మన్‌కీబాత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా మోదీ పాలన చేస్తున్నారని తెలిపారు. దీనిని కాంగ్రెస్ జీర్ణించుకోలేక విదేశీ వేదికలపై రాహుల్‌గాంధీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో శత్రుదేశాలకు భయం పుట్టించారన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ మొదటిసారి కాదని ఇప్పటికే ఎనిమిది సార్లు జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు నష్టపరిహారం ఇవ్వకుండా కొడంగల్ నియోజకవర్గంలో ఇండ్లను కూల్చివేయడం దారుణమన్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలను కొడంగల్ తరహాలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవిష్యత్ బాగుండాలంటే బీజేపీ అధికారంలో ఉండాలన్నారు. రాబోయే పట్టభధ్రుల ఎన్నికల్లో కార్యకర్తలు బీజేపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవన్‌కుమార్‌రెడ్డి, రతంగ్‌పాండ్ రెడ్డి, పడాకుల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రమేష్, నాయకులు ప్రతాప్‌రెడ్డి, పున్నంచంద్ లాహోటీ, మండల అధ్యక్షులు అశోక్, సతీష్, బస్వరాజు, కేశవరెడ్డి, బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అబద్దపు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ


