అనంతగిరి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రైవేటు పాఠశాలల సంఘం(ట్రస్మ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్ రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని న్యూ గీతాంజలి విద్యాలయంలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు మనల్ని గుర్తించాలన్నా, మన సమస్యలు పరిష్కరం కావాలన్నా ఓటు అనే ఆయుధం మన వద్ద ఉండాలని సూచించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన బలాన్ని భారీగా పెంచుకోవాలని కోరారు. జిల్లాలో సుమారు లక్ష ఓట్లు నమోదు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. సమావేశంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఎం నాగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు బసవరాజ్, జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు పాఠశాలల సంఘంరాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్ రెడ్డి


