చేవెళ్ల: మున్సిపాలిటీ పరిధిలోని పామెన వార్డులో బతుకమ్మలు వేసేందుకు నీటి కుంటలు లేకపోవటంతో ఆదివారం స్థానిక కౌన్సిలర్ దావల్గారి గోపాల్‌రెడ్డి తాత్కాలికంగా నీటి గుంతను ఏర్పాటు చేయించి, నీరు పోయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పామెనలో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదన్నారు. వాగులో ఎప్పుడు నీళ్లు ఉండేవని, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవటంతో వాగు ఎండిపోయిందన్నారు. దీంతో బతుకమ్మలు వేసేందుకు నీటి నిల్వ గుంతను ఏర్పాటు చేయించామన్నారు. సోమవారం వార్డులో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతాయని చెప్పారు.


