● సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
● ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్‌జోషి
ఇబ్రహీంపట్నం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్‌జోషి ఆదేశించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని అక్టోపస్‌లో ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభం, యాచారం మండలం కుర్మిద్దలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం) నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఆదివారం సీపీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటిష్టమైన భద్రతతోపాటు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఆయా కార్యక్రమాలు సజావుగా సాగేలా చూడాలని సూచించారు. ఇబ్రహీంపట్నంలోని కమిషనరేట్ ప్రారంభోత్సవ బందోబస్తుకు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, డీఎస్పీ డి.కృష్ణను, కుర్మిద్దలోని ఎన్‌ఐయూఎం శంకుస్థాపన భద్రతా పర్యవేక్షణకు అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, డీఎస్పీ జనార్దన్‌ను నియమించారు. సమావేశంలో జాయింట్ సీపీ చందనా దీప్తి, పోలీసు అధికారులు పాల్గొన్నారు. కాగా, ఇబ్రహీంపట్నం సమీపంలోని అక్టోపస్‌లో నిర్మించిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవనం ప్రారంభోత్సవానికి సీఎం రానున్న సందర్భంగా ప్రత్యేక పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి.


