పాడి పరిశ్రమపై.. ఎల్‌నినో! | - | Sakshi
Sakshi News home page

పాడి పరిశ్రమపై.. ఎల్‌నినో!

Oct 19 2026 7:47 AM | Updated on Oct 19 2026 7:47 AM

కడ్తాల్‌ బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌కు గత ఏడాది ఇదే సమయంలో రోజుకు సగటున 25,000 లీటర్ల పాలు వచ్చేవి. ప్రస్తుతం 6,700 లీటర్లకు పడిపోయింది. చంద్రదనలో ఐదు వేల నుంచి 3,800కు, మాడ్గులలో 7,500 నుంచి 6000కు, జైత్వారంలో మూడు వేల నుంచి 2,500కు, చల్లంపల్లిలో ఆరు వేల నుంచి 5,500కు, ఇబ్రహీంపట్నంలో 6,500 నుంచి 5,800 లీటర్లు తగ్గింది. జిల్లాలోని షాద్‌నగర్‌, యాచారం, కందుకూరు, మంచాల మిల్క్‌ చిల్లింగ్‌ కేంద్రాల్లోనూ పాల దిగుబడి, సేకరణ భారీగా తగ్గుముఖం పట్టింది.

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు వరి, పత్తి పంటలనే కాదు.. పాల దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే వ్యవసాయ భూములన్నీ రియల్‌ వెంచర్లుగా మారడానికి తోడు ప్రస్తుతం సరైన వర్షాలు లేక, చెరువులు, కుంటలు ఎండిపోయి, భూగర్భజలాలు పాతాళానికి పడిపోయి, బోరు బావుల కింద పశుగ్రాసం సాగు తగ్గిపోయింది. పచ్చిగడ్డి లేకపోవడం, మార్కెట్లో దాణా ధరలు అమాంతం పెరగడంతో డెయిరీల నిర్వాహకులు గేదెలు, ఆవులను పోషించలేక వదిలించుకుంటున్నారు. ఉన్న వాటికి కూడా పచ్చిమే త లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పాల దిగుబడి రావడం లేదు. విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ డెయిరీలు సరిహద్దు రాష్ట్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. గ్రేటర్‌ జిల్లాలకు రోజుకు సగటున 33 లక్షల లీటర్ల పాలు అవసరం కాగా, విజయ, మదర్‌ డెయిరీలతో పాటు హెరిటేజ్‌, తిరుమల, దొడ్ల, అమూల్‌, గోకుల్‌ వంటి 12 ప్రముఖ డెయిరీలు సుమారు 15 నుంచి 20 లక్షల లీటర్ల పాలను మాత్రమే రైతుల నుంచి సేకరిస్తున్నట్లు తెలిసింది. డిమాండ్‌కు సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. కొంత మంది పసిపిల్లలు తాగే పాలను కల్తీ చేస్తుంటే.. మరికొంత మంది ఏకంగా కృత్రిమ పాలను తయారు చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. జిల్లాలోని కడ్తాల్‌, కందుకూరు, ఆమనగల్లు, కాటేదాన్‌, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, ముచ్చింతల్‌, పసుమాముల, నాదర్‌గుల్‌ తదితర ప్రాంతాల్లో కల్తీపాల దందా మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు సాగుతోంది. ప్రముఖ బ్రాండ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్యాకెట్లను తయారు చేసి, మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ పాలను తాగిన పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు.

డెయిరీ పేరు: నార్మూల్‌ మదర్‌

(హయత్‌నగర్‌)

ప్లాంటు సామర్థ్యం: 3 లక్షల లీటర్లు

పాడి రైతులు : 70,000 మంది

గతంలో రోజు సగటు పాలసేకరణ: 1.20 లక్షల లీటర్లు

ప్రస్తుత సేకరణ: 13 వేల లీటర్లు

తగ్గిన పాలదిగుబడి: 95 వేల లీటర్లు

పెండింగ్‌లో ఉన్నబిల్లులు: నాలుగు విడతలు

డెయిరీ పేరు: విజయ మెగా

(రావిర్యాల)

ప్లాంటు సామర్థ్యం: ఐదు లక్షల లీటర్లు

పాడి రైతులు: లక్షన్నర మంది

రోజు సగటు పాలసేకరణ: 80,000 లీటర్లు

ప్రస్తుత సేకరణ: 50,000 లీటర్లు

తగ్గిన పాలదిగుబడి: 30,000 లీటర్లు

పెండింగ్‌లో ఉన్నబిల్లులు: రెండు విడతలు

పచ్చిమేత లేక.. పాలదిగుబడి రాక

ప్రభుత్వ డెయిరీలకు తగ్గిన సరఫరా

డిమాండ్‌, సరఫరాకు మధ్య తీవ్ర వ్యత్యాసం

‘క్యాష్‌’ చేసుకుంటున్న వ్యాపారులు

గుట్టుగా కృత్రిమ పాల తయారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement