సర్పంచ్ శ్రీనివాస్
మొయినాబాద్‌రూరల్: గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని మేడిపల్లి సర్పంచ్ మల్కపురం శ్రీనివాస్ అన్నారు. గ్రామంలోని 5వ వార్డులో ఎంపీ నిధులు రూ.5 లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు మమతరమేశ్, నవీన్‌కుమార్, బాలరాజ్, శ్రీశైలం, మధూకర్ పాల్గొన్నారు.
క్రిమినల్ కేసులు చేవెళ్ల కోర్టుకు మార్చడం హర్షణీయం
కాంగ్రెస్ నాయకుడు గోపికృష్ణారెడ్డి
మొయినాబాద్‌రూరల్: మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రిమినల్ కేసులు చేవెళ్ల కోర్టుకు మార్చడం ప్రజలకు ఎంతో మేలు కలిగించిందని కాంగ్రెస్ నాయకులు బూర్గు గోపికృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు మొయినాబాద్‌కు సంబంధించి సివిల్, ట్రాఫిక్, ఎకై ్సజ్ ఆబ్కారీ కేసులు చేవెళ్ల కోర్టు పరిధిలో ఉండగా.. కేవలం క్రిమినల్ కేసులు రాజేంద్రనగర్ కోర్టు పరిధిలో ఉండేవన్నారు. ఒకే వ్యక్తికి సంబంధించిన వేరువేరు కేసులు రెండు ప్రాంతాల్లో ఉండడంతో ఇబ్బందికరంగా ఉండేదన్నారు. క్రిమినల్ కేసుల కోసం రాజేంద్రనగర్ కోర్టుకు, సివిల్ ఇతర కేసుల కోసం చేవెళ్ల కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. దీంతో ప్రజలు వేరువేరు న్యాయవాదులను ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక భారం పెరగడమే కాకుండా ప్రయాణానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చేదన్నారు. తాజాగా మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని క్రిమినల్ కేసులు చేవెళ్ల కోర్టుకు మార్చడంతో ప్రజలకు ఎంతో ఊరట లభించిందన్నారు. ప్రజారవాణాపై ఆధారపడే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు.
అభినందన
శంకర్‌పల్లి: మహిళలు తాము అనుకున్న లక్ష్యాలను సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చేవెళ్ల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండమీది వెంకటేశం అన్నారు. ఇటీవల ప్రకటించిన జూనియర్ సివిల్ జడ్జి ఫలితాల్లో మండలంలోని మహాలింగాపురం గ్రామానికి చెందిన గండు మనీషారెడ్డి సత్తాచాటిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం ఆయన మనీషారెడ్డి ఇంటికి వెళ్లి, వారి దంపతులకు భగవద్గీత, శాలువా కప్పి ఘనంగా సన్మానించి, అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ మండలం నుంచి ఒక జడ్జి ఎంపిక కావడం గర్వకారణమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో మరింత మంది ముందుకు రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకుడు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ సిబ్బందికి దుస్తుల పంపిణీ
మొయినాబాద్: మున్సిపల్ సిబ్బందికి తాము అండగా ఉంటామని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గరుగు రాజు అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని ఆదివారం చిలుకూరులో మున్సిపల్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు. అదేవిధంగా సురంగల్‌లో 13వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీవెంకట్‌రెడ్డి కార్మికులకు దుస్తులు, కిరాణ సామగ్రి అంద జేశారు.
చాదర్‌ఘాట్: సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపిన మేరకు.. పల్టన్‌కు చెందిన విద్యార్థి పవన్ (20) స్నేహితుడితో కలిసి శనివారం అర్ధరాత్రి తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. సైదాబాద్ స్టీల్‌బ్రిడ్జ్ ప్రారంభం వద్ద వేగంగా వెళ్తూ టిప్పర్ లారీ సమీపంలో కట్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో మరో వాహనాన్ని ఢీకొట్టి ఇద్దరూ కిందపడిపోయారు.తీవ్ర గాయాలతో పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలైన మరో యువకుడిని చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


