మల్లారెడ్డిగూడెం బిడ్డ.. ఆస్ట్రేలియాలో మేయర్‌ | - | Sakshi
Sakshi News home page

మల్లారెడ్డిగూడెం బిడ్డ.. ఆస్ట్రేలియాలో మేయర్‌

Oct 2 2026 7:26 AM | Updated on Oct 2 2026 7:26 AM

మోమిన్‌పేట: మండల కేంద్రానికి చెందిన ఓ ఆడ బిడ్డ ఆస్ట్రేలియాలో మేయర్‌ అ య్యారు. ఇది ఎంతో గర్వ కా రణమని మండల ప్రజలు, గ్రామస్తులు అంటున్నారు. మల్లారెడ్డిగూడెంకు చెందిన శంకర్‌రెడ్డి, సరళ దంపతులకు నలుగురు సంతానం. శంకర్‌రెడ్డి రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగిగా విధులు నిర్వహించారు. ఐదు దశా బ్దాల క్రితం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు రామేశ్వర్‌రెడ్డి సింగపూర్‌లో, రెండో అమ్మాయి సరిత హైదరాబాద్‌లో, మూడో అబ్బా యి సత్యనారాయణరెడ్డి అమెరికాలో, నాలుగో అమ్మాయి సంధ్యారెడ్డి ఆస్ట్రేలియాలో సెటిలయ్యారు. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న సంధ్యారెడ్డి భర్త బుచ్చిరెడ్డితో పాటు ఆస్ట్రేలియాలో ఉంటోంది. గతంలో సిడ్నిలోని సౌత్‌ ఫీల్డ్‌ కౌన్సిలర్‌గా, డిప్యూటీ మేయ ర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో మండల ప్రజలు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement