కాళ్లు విరగ్గొట్టయినా అడ్డుకోండి | - | Sakshi
Sakshi News home page

కాళ్లు విరగ్గొట్టయినా అడ్డుకోండి

Oct 2 2026 7:26 AM | Updated on Oct 2 2026 7:26 AM

● డంప్‌యార్డుతో గిరిజనులకు నష్టం

● జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు హుస్సేన్‌నాయక్‌

కొత్తూరు: ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా డంప్‌యార్డు ఏర్పాటు కోసం అధికారులు ప్రయత్నిస్తే కాళ్లు విరగ్గొట్టయినా పనులు ఆపాలని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు హుస్సేన్‌నాయక్‌ అన్నారు. డంప్‌యార్డు ఏర్పాటుపై జేఏసీ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన గురువారం సిద్ధాపూర్‌లో డంప్‌యార్డు ఏర్పాటు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అంతకు ముందు ఇన్ముల్‌నర్వలోని జేపీదర్గాను దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్యాలయాల్లో ఏసీ గదుల్లో కూర్చొని సిద్ధాపూర్‌లో డంప్‌యార్డు కోసం అధికారులు ప్రతిపాదించిన తీరును తప్పుబట్టారు. ఇప్పటికే జవహర్‌నగర్‌ డంప్‌యార్డు కారణంగా సమీపంలోని 50 కిలోమీటర్ల మేర వాయి, జల, వాతావరణ కాలుష్యం కారణంగా అక్కడి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాల్సిన డంప్‌యార్డును పచ్చటి పంట పొలాలు, కాలుష్యానికి దూరంగా ఉన్న గ్రామాల్లో ఏర్పాటు చేయాలనుకోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. సిద్ధాపూర్‌లో డంప్‌యార్డు ఏర్పాటు చేస్తే 50 గ్రామాలు, గిరిజనతండాలకు చెందిన ప్రజలు ఆస్తులు, పొలాలు, తమ అస్తిత్వాన్ని కోల్పోతారని తెలిపారు. అధికారులు ప్రకటిస్తున్న విధంగా అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేయనున్న డంప్‌యార్డును ఎయిర్‌పోర్టు, రాచకొండ అటవీ ప్రాంతం, ఫ్యూచర్‌సిటీ, కొడంగల్‌లో ఇటీవల ప్రభుత్వం సేకరించిన పొలాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా గిరిజనులకు చెందిన పొలాలను ఆయా అభివృద్ధి కార్యక్రమాల పేరిట సేకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 22ఏ పేరిట పేదలు, అమాయకులు, పొలాల యజమానుల నుంచి పెద్దమొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వం డంప్‌యార్డు ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నంబర్‌ 641 రద్దు చేసే వరకు అధికారులపై ఒత్తిడి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, కమిటీ సభ్యులు రాంబాల్‌నాయక్‌, సత్యనారాయణ, శేఖర్‌రెడ్డి, మిట్టునాయక్‌, గోపాల్‌నాయక్‌, అందె బాబయ్య, శ్రీవర్థన్‌రెడ్డి, పినపాక ప్రభాకర్‌, అయా గ్రామాల సర్పంచులు, డంప్‌యార్డు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

గిరిజన రైతులకు అండగా ఉంటా

యాచారం: బలవంత భూసేకరణ పేరుతో గిరిజన రైతులను భయాందోళనకు గురి చేయాలని చూస్తే సహించేది లేదని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు హుస్సేన్‌నాయక్‌ హెచ్చరించారు. కుర్మిద్ద గ్రామ పరిధిలోని గిరిజన తండాల్లో గురువారం పర్యటించి ఫార్మాసిటీ భూభాదిత రైతులతో సమావేశమయ్యారు. అటవీ ప్రాంతాల్లో జీవించే గిరిజనులకు నాటి కాంగ్రెస్‌ హయాంలో ఇందిరమ్మ భూములిస్తే నేడు అదే కాంగ్రెస్‌ గిరిజనుల వద్ద భూములు తీసుకుని తండాలనే లేకుండా చేస్తోందని మండిపడ్డారు. గిరిజన రైతులు భయాందోళన చెందొద్దని, కమిషన్‌ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement