నవాబుపేట: ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన నవాబుపేట పీఏసీఎస్ పాలకవర్గం గురువారం ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆయన స్వగ్రామం చించల్‌పేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పనిచేయాలన్నారు. సకాలంలో రుణాలు ఇచ్చి ఆదుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నూతన పీఏసీఎస్ చైర్మన్ రంగారెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, డైరెక్టర్లు మల్లారెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఖదీర్, మోనాచారి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య


