అనుమానాస్పద స్థితిలో కౌలు రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో కౌలు రైతు మృతి

Oct 2 2026 7:26 AM | Updated on Oct 2 2026 7:26 AM

అనుమానాస్పద స్థితిలో కౌలు రైతు మృతి

ఇబ్రహీంపట్నం: అనుమానాస్పద స్థితిలో కౌలు రైతు మృతిచెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఏసీపీ కేవీపీ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం మండలం చింతుల్ల గ్రామానికి చెందిన అదటి కిరణ్‌ (40) ఇబ్రహీంపట్నంలో నివసిస్తూ స్థానిక భారత్‌ గార్డెన్‌ వెనుక పొలాన్ని కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నాడు. గురువారం ఉదయం ఇంటి నుంచి గేదెలను పొలానికి మేతకు తీసుకెళ్లి వదిలాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అక్కడ పనిచేసే పద్మమ్మ అనే మహిళ వ్యవసాయ క్షేత్రం వద్ద కిరణ్‌ పడి ఉండటాన్ని గమనించి కుటుంబసభ్యులకు సమచారం ఇచ్చారు. వైద్యుడు వచ్చి పరిశీలించగా అప్పటికే కిరణ్‌ మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుడి కన్ను, నుదటి భాగంలో, గొంతుపై, కుడి చేతిపై గాయాలున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహన్ని పోస్టుమార్టానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement