తాండూరు రూరల్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం రీ సర్వే చేస్తోందని, ఇందుకు రైతులు, ప్రజలు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి అన్నారు. శుక్రవారం మండలంలోని చిట్టిఘనాపూర్‌లో భూ రీసర్వేపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడతలో చింతమణిపట్నం, చిట్టిఘనాపూర్, వీర్‌శెట్టిపల్లి, గుంతబాసుపల్లి గ్రామాల్లో సర్వే చేయనున్నట్లు తెలిపారు. అధికారులు గ్రామాన్ని సందర్శించిన సమయంలో రైతులు పట్టాదారు పాసుపుస్తకం, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర ఆధారాలతో సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, తహసీల్దార్ తారాసింగ్, సర్పంచ్ విజయ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి అమరేశ్వరి, మాజీ ఎంపీపీ శరణు బసప్ప, ఏఎంసీ డైరక్టర్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులు సహకరించాలి
అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి


