తాండూరు: సమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తులసీ గార్డెన్‌లో నియోజకవర్గంలోని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో వారి కృషి ఎంతో ఉంటుందన్నారు. అంతకు ముందు తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాలకు చెందిన ఎంఈఓలు ఎమ్మెల్యేను సత్కరించారు. కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నాపరాయి పరిశ్రమలను ఆదుకోండి
తాండూరు నాపరాయికి దేశ వ్యాప్తంగా ఎంతో పేరు ఉందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. తాండూరు నాపరాతి పరిశ్రమ సంక్షోభంలో పడిందన్నారు. ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. పట్టణంలో భారీ వాహనాల పార్కింగ్ కోసం 18 ఎకరాల స్థలం సేకరించడం జరిగిందని, అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయమన్నారు. ఎన్నో ఏళ్లుగా సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన ట్రాన్స్‌జెండర్లకు స్థానిక పాలనలో భాగస్వామ్యం కల్పించడం ప్రజా ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
ఉత్తమ టీచర్లకు సన్మానం


