సమస్యలపై పోరాటం | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై పోరాటం

Sep 12 2026 11:03 AM | Updated on Sep 12 2026 11:03 AM

పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌

బంట్వారం: ఉపాధ్యాయుల సమస్యలపై పీఆర్‌టీయూ అలుపెరుగని పోరాటం చేస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం కోట్‌పల్లి మండలం రాంపూర్‌ ప్రాథమిక పాఠశాలలో పీఆర్‌టీయూ సర్వసభ్య నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్‌సీ అమలు చేసే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే వెంటనే సానుకూల ప్రకటన చేయాలన్నారు. అనంతరం పీఆర్‌టీయూ కోట్‌పల్లి మండల అధ్యక్షుడిగా విశ్వేశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా నవీన్‌, గౌరవ అధ్యక్షుడిగా వేణుగోపాల్‌, కార్యదర్శిగా సంపత్‌ నియమితులయ్యారు. మహిళా అసోసియేట్‌ అధ్యక్షులుగా మరియా, ఉపాధ్యక్షులుగా పరమేశ్వరి, కార్యదర్శిగా మాధవి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆనందర్‌రావు, ఎంఈఓ చంద్రప్ప, ఎస్‌ఐ శైలజ, హెచ్‌ఎం శారద, సర్పంచ్‌ నీలమ్మ, సంఘ నాయకులు రామకృష్ణగౌడ్‌, శేఖర్‌, మొహినొద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement