కిసాన్‌ మోర్చా నారాయణపేట ఉపాధ్యక్షుడిగా బుగ్గప్ప | - | Sakshi
Sakshi News home page

కిసాన్‌ మోర్చా నారాయణపేట ఉపాధ్యక్షుడిగా బుగ్గప్ప

Sep 10 2026 8:41 AM | Updated on Sep 10 2026 8:41 AM

నర్సరీలకు అనుమతులు తప్పనిసరి కాంగ్రెస్‌తోనే ఎస్టీలకు న్యాయం ధ్రువపత్రాలు సమర్పించాలి కేటీఆర్‌పై ఫిర్యాదు ఆమనగల్లు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన హైదరాబాద్‌లోని బేగంబజార్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేటీఆర్‌ వ్యాఖ్యలు రాజకీయ పరిధిని దాటి వ్యక్తిగతంగా అవమానించేలా ఉన్నాయని అన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంచార్జి ఎలుగొండ మధుసూదన్‌రెడ్డి, ఆమనగల్లు మాజీ సర్పంచ్‌ గుర్రం కేశవులు తదితరులు ఉన్నారు.

దౌల్తాబాద్‌: కిసాన్‌ మోర్చా నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా మండలంలోని గోకఫసల్‌వాద్‌ గ్రామానికి చెందిన పోతుల బుగ్గప్ప ఎన్నికయ్యారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. తనకు పదవి అప్పగించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా చేస్తానన్నారు.

జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సత్తార్‌

అనంతగిరి: నర్సరీలు ఏర్పాటు చేసేవారు, ఇప్పటికే నిర్వహిస్తున్న వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి ఎంఏ సత్తార్‌ ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా నర్సరీలను ఏర్పాటు చేయరాదన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని నర్సరీల యజమానులకు తెలంగాణ నర్సరీ చట్టంపై అవగాహన కల్పించారు. కూరగాయలు, పూలు, పండ్ల మొక్కల నారు పెంచుతున్న వారు ఉద్యాన శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన నారు సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు కమల, సురేంద్రనాథ్‌, యమున, సంతోష్‌ కుమార్‌, అక్షిత రెడ్డి, ఉద్యాన విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి: అణగారిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు ధారాసింగ్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని అతిథి గృహంలో ఏఐసీసీ సంఘటన సృజన్‌ అభియాన్‌లో భాగంగా ఆలిండియా ఆదివాసీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్ష పదవికి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్‌లో అర్జీలు స్వీకరించామని, సెప్టెంబర్‌ 12న పరిగి, 13న కొడంగల్‌, తాండూరులో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఎస్టీ సెల్‌ రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ లింగం నాయక్‌, సంగారెడ్డి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాంచంద్రానాయక్‌ పరిశీలకులుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు శివరాంనాయక్‌, నాయకులు రవి నాయక్‌, పరుశరాం నాయక్‌, రాములు నాయక్‌, విఠల్‌ నాయక్‌, శాంత నాయక్‌, సత్యహరిచంద్ర, శ్రీను నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి

నవాబుపేట: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ఇచ్చే ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా చూడాలని చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి సూచించారు. బుధవారం నవాబుపేట తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో సర్‌ ప్రక్రియపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మ్యాపింగ్‌ కాని, అనామలిస్‌ జాబితాలో పేర్లు ఉన్న ఓటర్లు నిర్ణీత గడువులోగా అన్ని ఆధారాలు సమర్పించాలని సూ చించారు. నియోజకవర్గంలో 52,359 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారు లు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బుచ్చయ్య, ఎంపీడీఓ అనురాధ, ఎంపీఓ విజయ్‌ కుమార్‌, డీటీ నవీన్‌ కుమార్‌ రెడ్డి, సర్పంచ్‌ గాజుల గూడెం నర్సింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శి నవనీత, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement