అనంతగిరి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈనెల 15 నుంచి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్ సిబ్బందికి సూచించారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పారామెడికల్ ఆప్తమిక్ అధికారులు, రాష్ట్రయ బాల స్వస్త కార్యక్రమం టీంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో కంటి సంబంధ సమస్యలు గుర్తించడం, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించడం, కళ్లద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అందుకు పాఠశాలల వారీగా సిద్ధం కావాలని సూచించారు. అనంతరం సీహెచ్‌సీ సెంటర్ల వైద్యాధికారులతో మాట్లాడారు. సీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల వివరాలను హెచ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. రక్తపోటు, మధుమేహం వ్యాధి గ్రస్తుల స్క్రీనింగ్ అనంతరం ఎన్‌సీడీ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. సీజనల్ వ్యాధులను ఎప్పటికపుడు నమోదు చేయాలని సూచించారు.
డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్


